Home  »  TV News  »  హన్సికాస్ లవ్ షాదీ డ్రామా  సిరీస్ మొదలైంది!

Updated : Feb 11, 2023

హీరోయిన్ హన్సిక గత ఏడాది సోహెల్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు తనకి ఎదురయిన సమస్యలను, సవాళ్ళని తన కెరీర్ పై మీడియా ఎఫెక్ట్ ఎలా పడింది? అలాంటి దుష్ప్రచారాలను ఎలా ఎదుర్కొంది? ఎలా పెళ్ళి చేసుకుందో తెలియాలంటే డిస్నీ హాట్ స్టార్ లోని ఈ 'హన్సికాస్ లవ్ షాది డ్రామా ' సిరిస్ ని చూడాల్సిందే. హన్సిక తన సినిమా కెరీర్ లో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొందని, అయితే తను లవ్ చేసిన విషయాన్ని మీడియా ముందే పసిగట్టి ఏదో రాశారు. దీంతో తను షాదీ చేసుకుందని చెప్పింది. అయితే తన షాదీ టైం లో తనకి ఇంట్లో ఎదురయ్యిన పరిస్థితులను వివరించింది హన్సిక.

'దేశముదురు' సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హన్సిక.. తెలుగులో బాగానే రాణించింది. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి సోహెల్ తో పెళ్ళి అని.. తనకి సోహెల్ ప్రపోజ్ చేసిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో అందరూ తనకి అభినందనలు తెలిపారు. అయితే ఇలా తను ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ సిరీస్ లో చూపించారు. సోహెల్ కి గతంలోనే వివాహం జరిగిందని.. అతడు తన భార్య నుండి విడిపోవడానికి కారణం హన్సికనే అంటూ బయట పత్రికలలో రావడంతో.. ఆ వార్త తనని ఎంతగానో బాధపెట్టిందని హన్సిక ఈ ఎపిసోడ్ లో చెప్పింది.

హన్సిక అమ్మ తనకి బ్యాక్ బోన్ అని , తన తమ్ముడు(ప్రశాంత్ మోత్వాని) తనకు కీలక టైంలో సపోర్ట్ ఇచ్చాడని హన్సిక చెప్పుకొచ్చింది. తన పెళ్ళి జరిగే వరకు తను ప్రేమలో ఉన్నట్టు ఎవరికి చెప్పాలనుకోలేదని.. ఆ విషయం మీడియాలో ముందే రావడంతో.. చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యిందని చెప్పింది. వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినకుండా హైపర్ అవ్వడంతో.. తన తమ్ముడు ప్రశాంతంగా ఆలోచించమని చెప్పాడని చెప్పింది. "ఎవరో బయటవాళ్ళు నీ సీక్రెట్స్ రీవల్ చేస్తారని స్ట్రెస్ తీసుకోవడమెందుకు.. నువ్వే సోషల్ మీడియాలో పోస్ట్ చేసెయ్.. అప్పుడు నీ స్ట్రెస్ పోతుంది కదా" అని తన బ్రదర్ చెప్పడంతో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రతీ శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్ తో 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ' లో స్ట్రీమ్ అవబోతున్న  ఈ సిరిస్ ని  చూసెయొచ్చు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.